హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ క్యాన్సర్ కి సరియైన పరిష్కారాన్ని అందిస్తుందా?

You are currently viewing హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ క్యాన్సర్ కి సరియైన పరిష్కారాన్ని అందిస్తుందా?

హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ 1990లో ప్రారంభించబడి, 2003లో పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం, మానవ జీనోమ్ తో పాటు ఎకువగా వాడే ల్యాబ్ అనిమల్ అయిన మౌస్ మరియు ఫ్రూట్ ఫ్లై జీనోమ్ ను సీక్వెన్స్ చేయడం.

ఈ ప్రాజెక్ట్ మానవ జీణ్ బ్లూప్రింట్ ను రూపొందించడానికి, వాటి ద్వారా క్యాన్సర్ కు దారితీసే జీన్ మ్యుటేషన్ లను గుర్తించడానికి మరియు వివిధ క్యాన్సర్ సెల్ల్స్ DNA సీక్వెన్స్ చేయడానికి రూపొందించబడింది.

క్యాన్సర్ ను నిర్ధారించడం, చికిత్స చేయడం మరియు నివారించడం వంటి కొత్త పద్ధతులను రూపొందించడానికి మరియు జీన్ మ్యుటేషన్ ల డేటాబేస్ ను సృష్టించడానికి ఉపయోగపడుతుందని చాలా మంది పరిశోధకులు విశ్వసించారు.

హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క అంచనా వ్యయం $3 బిలియన్లు, అందులో DNA సీక్వెన్సింగ్ కోసం $300 మిలియన్లు మాత్రమే ఉపయోగించబడింది, అయితే మిగిలిన మొత్తం సీక్వెన్సింగ్ కోసం కావాల్సిన టెక్నాలజీ అభివృద్ధికి ఖర్చు చేయబడింది.

జీన్ మ్యుటేషన్ లే క్యాన్సర్ను అభివృద్ధి చేయవచ్చని చాలా మంది నమ్ముతుంటారు, వాటిలో ఎక్కువ భాగం వారసత్వంగా వస్తాయని విశ్వసిస్తారు. క్రానిక్ మైలోజెనస్ లుకేమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు పెద్దప్రేగు క్యాన్సర్ లో కూడా కొన్ని జీన్ మ్యుటేషన్ లను గుర్తించారు.

ఈ జీన్ మ్యుటేషన్ లను మనిషి జెనెటిక్ మ్యాప్ తో పోలుస్తూ క్యాన్సర్ యొక్క బలహీనతకు మెరుగైన పరిష్కారాన్ని ఇస్తుందని భావించారు . కానీ వాటి ఫలితాలు మనకు అంత ఆశించినంతగా రాలేదు.

క్యాన్సర్ రోగుల నుండి వందలాది జీన్స్ను మ్యాప్ చేయడానికి 2005 వ సంవస్తరములో క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ (TCGA) ని ప్రారంభించారు.

హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ లో, ఒక మానవ జీనోమ్ ని సీక్వెన్సింగ్ చేస్తే క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ (TCGA)లో వేలాది క్యాన్సర్ సెల్ల్స్ యొక్క పూర్తి జీనోమ్ ని సీక్వెన్సింగ్ చేయడం జరిగింది.

ఇక్కడ క్యాన్సర్ సెల్ల్స్ లొ జీన్ మ్యుటేషన్ లు చాల వేగంగా మరియు నిరంతరంగా జరుగుతుంటాయి కాబట్టి వాటిని ప్రతి సారి, ప్రతి పేషంట్ నుంచి తీసుకుని సీక్వెన్సింగ్ చేయడం చాలా కష్టమైన పని.

ఈ జీన్ మ్యుటేషన్ లు చాల రకాలుగా ఉంటాయి. ఒకే క్యాన్సర్ ట్యూమర్ లోని రెండు కణాల జీన్ మ్యుటేషన్ లు వేర్వేరుగా కలిగి ఉంటాయి. జీణ్ అనాలసిస్ చేసేటపుడు కొన్ని సెల్ల్స్ మిస్ అవడం కూడా జరగడం వలన కొన్ని జీన్ మ్యుటేషన్ మిస్ అవడం జరుగుతుంది.

కొన్ని సందర్భాల్లో, పర్యావరణ ప్రభావం వల్ల జరిగే ఎపిజెనేటిక్ చెంజాస్ (epigenetic changes) ద్వారా జీన్ మ్యుటేషన్ లు అభివృద్ధి చెందుతాయి. వీటిని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మరియు క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ (TCGA) అధ్యయనం చేయలేకపోతుంది. ఎపిజెనేటిక్ చెంజాస్ ను విశ్లేషణ చేసే సాంకేతికత ఆ సమయంలో అభివృద్ధి చెందలేదు.

కావున క్యాన్సర్ కు దారితీసేది, DNA ల ద్వారా జరిగే జిన్ముటేశణ్లు అనే సిద్ధాంతాన్ని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ నిర్ధారించలేకపాయింది. కానీ కొన్ని ప్రత్యేకమైన ముట్టేషణ్ లు క్యాన్సర్ కు ఎలా కారణమవుతాయో మరియు వివిధ క్యాన్సర్ లలో ప్రత్యేకమైన జీన్లను ఎలా గుర్తించగలమో మనకు తెలియచేయడంలో మాత్రం సహాయం చేయగలిగింది.

Also read: క్యాన్సర్‌కు రసాయన ఆయుర్వేద చికిత్స – జీవన విధానం