క్యాన్సర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది.. మరణం.
ఎందుకంటే క్యాన్సర్ అంటేనే బ్రతికే అవకాశం లేదని ఎందరికో అపోహ,
క్యాన్సర్ ను కేవలం బాగా డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీలు మాత్రమే జయించగలరని మరికొందరి అపోహ..
కానీ క్యాన్సర్ పై అవగాహన లెకపోవటం వల్లే అపోహలు, భయాలు పెరిగిపోతున్నయన్నది అసలు నిజం. క్యాన్సర్ ను సరైన సమయానికి గుర్తించి సరైన వైద్యం అందిస్తే క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయగలమని పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ ఎందరో క్యాన్సర్ బాధితులను రసాయన ఆయుర్వేద చికిత్స సహాయంతో క్యాన్సర్ బారి నుండి కాపాడి నిరూపించింది.
భారత దేశంలో మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల వల్ల క్యాన్సర్ వ్యాధి మరింత తీవ్రమవుతూ వస్తుంది, ఇలాంటి సమయంలో క్యాన్సర్ గురించి ప్రతీ ఒక్కరికీ సరైన అవగాహన అవసరం.
సరైన సమయానికి గుర్తించగలిగితేనే సరైన వైద్యాన్ని అందించాగలమన్నది వాస్తవం.
ఆ అవగాహన కల్పిస్తూనే ఆయుర్వేదం సహాయంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్సర్ కు మేలైన వైద్యం అందిస్తూ క్యాన్సర్ ఫ్రీ సమాజాన్ని సృష్టించాలనే సంకల్పంతో ముందుకెళుతున్న
పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ క్యాన్సర్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.
క్యాన్సర్ వెల్ఫేర్ డే (Welfare Of Cancer Patients) – 2023
కారణం క్యాన్సర్ సోకిన వ్యక్తుల్లో ధైర్యాన్ని నింపటానికి, వారు త్వరగా కోలుకొని ఆనందంగా జీవించగాలరనే నమ్మకాన్ని ఇవ్వటానికి క్యాన్సర్ వెల్ఫేర్ డే అనేది సెప్టంబర్ 22 వ తేదిన జరుపుకుంటాం.
ఈ ఏడాది క్యాన్సర్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో భాగంగా పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో సామాన్య ప్రజలకు క్యాన్సర్ పైన అవగాహన ఎంత వరకు ఉంది అనే విషయాన్ని సామాన్యులను అడిగి తెలుసుకున్నారు అలాగే స్థానిక డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు క్యాన్సర్ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఇక క్యాన్సర్ వెల్ఫేర్ డే సందర్భంగా పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ లో క్యాన్సర్ బాధితులకు డ్రైఫ్రూట్స్ మరియు పండ్లు అందజేయటం జరిగింది.
క్యాన్సర్ పై సామాన్యులకు అవగాహన
క్యాన్సర్ వెల్ఫేర్ డే సందర్భంగా పునర్జన్ ఆయుర్వేద బృందం సామాన్యులకు క్యాన్సర్ పై అవగాహన ఎంత వరకు ఉందో తెలుసుకోవటానికి హైదరాబాదు లోని మణికొండ ప్రాంతంలో లో కొందరు సామాన్యులను క్యాన్సర్ గురించి వారి ఉద్దేశాన్ని తెలపమని కోరింది. ఒకరు మాట్లాడుతూ క్యాన్సర్ విషయంలో ఇప్పుడు ప్రజలు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే క్యాన్సర్ కు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మరొకరితో క్యాన్సర్ బాధితులకు వారు ఇచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించగా క్యాన్సర్ ను ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కోవాలని అన్నారు. మరికొందరు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్ల వల్లే క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువని, అలంటి దురలవాట్లకు చోటివ్వకుండా సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరొగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రజలకు సూచించారు. ఇక కొందరు మహిళలను క్యాన్సర్ పై వారి ఉద్దేశాన్ని అడగగా మహిళలకు ౩౦ నుండి 40 ఏళ్ళ మధ్యలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువని, సరైన ఆహారం తెసుకోని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.
పభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
క్యాన్సర్ వెల్ఫేర్ డే సందర్భంగా స్థానిక డిగ్రీ కళాశాలలోని విద్యార్థులతో పునర్జన్ ఆయుర్వేద బృందం క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది, ఆ కార్యకమంలో భాగంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు క్యాన్సర్ పట్ల వారి ఉద్దేశాన్ని తెలియజేసారు. అందులో భాగంగా పునర్జన్ ఆయుర్వేద నుండి ప్రదీప్ గారు మాట్లాడుతూ క్యాన్సర్ ఫ్రీ సమాజాన్ని సృష్టించటానికి యువత క్యాన్సర్ పైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో క్యాన్సర్ పట్ల వారి భావాన్ని తెలియజేసారు.
పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ లో డ్రైఫ్రూట్స్, పండ్లు పంపిణీ
పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ లో క్యాన్సర్ వెల్ఫేర్ డే సందర్భంగా పునర్జన్ ఆయుర్వేద బృందం పేషెంట్స్ కు డ్రైఫ్రూట్స్ మరియు పండ్లను అందజేసారు. ఈ కార్యక్రమంలో పునర్జన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు కూడా పాల్గొన్నారు. పునర్జన్ ఆయుర్వేద వైద్యులు మాట్లాడుతూ క్యాన్సర్ తో పోరాడే వారు త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నట్టు తెలిపారు.
చివరగా..
క్యాన్సర్ వెల్ఫేర్ డే అనేది క్యాన్సర్ వ్యాధి సోకిన వారిలో మనో ధైర్యాన్ని నింపడానికి జరుపుకునే రోజు, సమాజంలో క్యాన్సర్ పట్ల అవగాహన పెరిగితేనే క్యాన్సర్ ను సరైన సమయానికి గుర్తించగలం, సరైన చికిత్సను అందించి క్యాన్సర్ బారి నుండి తప్పించుకోగలం. క్యాన్సర్ ఫ్రీ సమాజాన్ని నిర్మించడానికి సరైన జీవన విధానాన్ని అలవరచుకొని సరైన పోషకాహారాన్ని తీసుకోవటం ముఖ్యం, ఎందుకంటే చికిత్స కంటే నివారణ తేలికైనది. సరైన జీవన విధానంతో క్యాన్సర్ ను నివారించటంలో అవగాహన కల్పిస్తూ , అలాగే క్యాన్సర్ కు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద చికిత్స ను అందిస్తూ భవిష్యత్తులో క్యాన్సర్ లేని సమాజాన్ని సృష్టించటానికి పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది.
Also read: Cancer Types: క్యాన్సర్ వ్యాధి ఎన్ని రకాలు ? గుర్తించడం ఎలా?
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.