సర్వరోగ నివారిణి !

గుమ్మడికాయ దిష్టికే కాదు… 

ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగించడానికి ఉపయోగపడ్డట్లే, శరీరంలోని  వ్యర్ధాలను తొలగించడానికి గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది.  

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది 

గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ A అనేది మన కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. 

యాంటి క్యాన్సర్

గుమ్మడి కాయలోని కెరోటినాయిడ్లు, విటమిన్ C మరియు ఫైబర్, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది 

బూడిద గుమ్మడి కాయలో పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.  

జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది 

బూడిద గుమ్మడి కాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  

రోగనిరోధక శక్తిని పెంచుతుంది 

బూడిద గుమ్మడి కాయలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.  

బరువు తగ్గడంలో సహాయపడుతుంది 

బరువు తగ్గాలని ఆశపడే వారికి కూడా బూడిద గుమ్మడికాయ మెరుగ్గా పని చేస్తుంది. ఎందుకంటే దీంట్లో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  

ఎవరు తాగకూడదు

అయితే చలువ గుణం కలిగి ఉన్నందున జలుబు తో బాధపడుతున్నవారు, ఆస్తమా పేషంట్లు, గర్భిణి స్త్రీలు వై ద్యుల సలహా మేరకే స్వీకరించాలి. అలాగే ఏ వయసువారైనా  సరే ముందు కొంచెం కొంచెం తాగడం అలవాటు చేసుకోవాలి.  

గుమ్మడికాయ అనేది ఒక ఆరోగ్యకరమైన కూరగాయ, ఎందుకంటే ఇది అనేక పోషకాలను అందిస్తుంది. కాకపోతే బూడిద గుమ్మడికాయను అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు.