Spirulina 

స్పైరులీనా మెరుగైన ఆరోగ్యానికి ఔషధం

ఈ నాచు తింటే.. షుగర్‌, హైబీపీ కంట్రోల్‌ ...

స్పైరులీనా అనేది ఒక బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది ఒక రకమైన సైనోబాక్టీరియ. చూడటానికి పచ్చగా నాచు లాగానే ఉంటుంది, నీళ్ళలోనే ఇది పెరుగుతుంది. 

స్పైరులినా లో ఉండే పోషకాలు

ఒక టేబుల్ స్పూన్ స్పైరులీనా లో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక విటమిన్ల విషయానికి వస్తే ఇందులో  విటమిన్లు A, B, C, D, E మరియు K వంటి అనేక విటమిన్లను కలిగి ఉంటుంది. 

రక్తపోటును తగ్గించడం

స్పైరులీనా లోని పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.  స్పిరులినాలోని పొటాషియం సోడియం స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, దానివల్ల రక్తపోటు తగ్గుతుంది.  

క్యాన్సర్ 

స్పైరులీనా క్యాన్సర్ కణాలను పై కూడా ఇవి ప్రభావం చూపగలవు. కొన్ని అధ్యయనాలు స్పైరులీనా క్యాన్సర్ కణాల మరణాన్ని కూడా ప్రోత్సహించగలదని సూచిస్తున్నాయి. 

మధుమేహం నియంత్రణ 

ఒక అధ్యయనంలో, డయాబెటిస్ ఉన్న వ్యక్తులు 12 వారాలు దీనిని తీసుకున్న తర్వాత వారి రక్తంలోషుగర్ లెవల్స్ తగ్గినట్లు కనుగొనబడింది. 

స్పైరులీనా దుష్ప్రభావాలు 

ఒకవేళ అధికంగా తీసుకున్నట్లయితే స్పైరులీనా ఈ దుష్ప్రభావాలను చూపవచ్చు.

స్పైరులీనా దుష్ప్రభావాలు 

– జీర్ణ సమస్యలు, విరేచనాలు, వాంతులు మరియు కడుపు నొప్పి. –  అలెర్జీ దురద, వాపు  – నరాల సమస్యలు, తలనొప్పి.

ఏదైనా సారీ మితంగా తీసుకుంటేనే ఔషధం మితిమీరితే సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకని దీనిని ఉపయోగించే ముందు వైద్యుడి సలహా తీసుకోవటం మంచిది.